ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని ఎదుర్కోవటానికే గొంగళి పురుగు లాంటి టీఆర్‌ఎ్‌సతో పొత్తు

ABN, First Publish Date - 2022-10-03T09:22:07+05:30

మతతత్వ బీజేపీని ఎదుర్కోవటానికి రాష్ట్రంలో గొంగళి పురుగులాంటి టీఆర్‌ఎ్‌సతో కలుస్తున్నామని, అదీ తాత్కాలికమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూనంనేని సాంబశివరావు

నేలకొండపల్లి, అక్టోబరు 2: మతతత్వ బీజేపీని ఎదుర్కోవటానికి రాష్ట్రంలో గొంగళి పురుగులాంటి టీఆర్‌ఎ్‌సతో కలుస్తున్నామని, అదీ తాత్కాలికమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ 16వ మహాసభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల నుంచే కమ్యూనిస్టులను తయారుచేయాలన్నారు. దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమేనన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 44చట్టాలను రద్దు చేసి, నాలుగు నల్ల చట్టాలను తెచ్చారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించటానికి మోదీ చేసిన యత్నాన్ని కమ్యూనిస్టు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు అడ్డుకున్నాయని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చాక అంబా నీ, అదానీల సంపద మాత్రమే పెరిగిందని ఆరోపించారు. ఓ వైపు కార్మికుల డొక్కలు ఎండుతుంటే, మరోవైపు దేశ సంపద 20ు మంది చేతుల్లోకి వెళ్తోందన్నారు. 80ు సంపద కేవలం 100 కుటుంబాల చేతుల్లోనే ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే దేశం శ్రీలంకలా తయారవుతుందని, మోదీ, షాలను తరిమి కొట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. 

Updated Date - 2022-10-03T09:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising