ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR : నాన్నతో పోల్చుకోలేను!

ABN, First Publish Date - 2022-07-23T10:50:43+05:30

తనకు, తన కుమారుడు హిమాంశుకు మధ్య ఉండే అభిప్రాయ భేదాల లాంటివే తనకు తన తండ్రి కేసీఆర్‌కు మధ్య ఉంటాయని రాష్ట్రమంత్రి కేటీఆర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆయన నాన్నే కాదు..బాస్‌ కూడా.. 
  • ఇదంతా ఆయన సామర్థ్యంతో సృష్టించిందే
  • తరాల అంతరంతో భేదాభిప్రాయాలు సహజం
  • ప్రజలిస్తున్న గౌరవం శాశ్వతం కాదని తెలుసు
  • బ్రిటన్‌ రాణిని కలవాలన్నది తీరని కోరిక
  • హై దరాబాద్‌లో ఆ నాలుగు బిర్యానీలు భేష్‌
  • సరదా ఇంటర్వ్యూలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్, జూలై 22(ఆంధ్రజ్యోతి): తనకు, తన కుమారుడు హిమాంశుకు మధ్య ఉండే అభిప్రాయ భేదాల లాంటివే తనకు తన తండ్రి కేసీఆర్‌(KCR)కు మధ్య ఉంటాయని రాష్ట్రమంత్రి కేటీఆర్‌(Minister KTR) అన్నారు. ఇది జనరేషన్‌ గ్యాప్‌లో సహజమేనని చెప్పారు. అయితే,  పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే విషయంలో కేసీఆరే తనకు బాస్‌ అని, ఆయన ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తానని అన్నారు. ఇప్పుడున్నదంతా తన తండ్రి అపార అనుభవంతో, సామర్థ్యంతో సృష్టించిందని, ఆయనతో తనను పోల్చుకోలేనని చెప్పారు. ఇటీవల ఆయన ఒక యూట్యూబ్‌ చానల్‌(youtube Channel)కు సరదా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన ఇష్టాఇష్టాలు, తండ్రిగా, కొడుకుగా తన పాత్రల గురించి మాట్లాడారు. అందులో ముఖ్యాంశాలు.


మీ బాల్యానికి, మీ పిల్లల బాల్యానికి తేడా ఏమైనా  ఉందా?

అప్పట్లో మేం స్వేచ్ఛగా తిరిగేవాళ్లం.ఆటలు, పాటలు, వీధుల్లో తిరగడం ఇవన్నీ...అదో సంతోషం. మా అబ్బాయికి 17 ఏళ్లు. అమ్మాయికి 13 ఏళ్లు. వారి ఆటలు వారికుంటాయి. కాకపోతే కాలం మారింది. మాకు అధికారంతో వచ్చిన ఇమేజ్‌ వల్ల పిల్లలు ఇక్కడ హైదరాబాద్‌(Hyderabad)లో సాధారణ జీవితం గడపలేకపోతున్నారు.  అందరిలా ఎక్కడికంటే అక్కడకు వెళ్లలేని పరిస్థితి. 


మీరు కూడా పేరెంట్స్‌ మీటింగ్స్‌కు వెళ్తారా?

కొన్నిసార్లు వెళ్తాను. కొన్నిసార్లు వెళ్లలేక పోతున్నాను. వెళ్లినప్పుడు మాత్రం మా పిల్లల చాలా సంతోషం వెలకట్టలేనిది. అక్కడ నన్ను మంత్రిగా కంటే....ఒక పేరెంట్‌(Parent)గానే టీచర్లు చూస్తారు. 


 ఒక వీవీఐపీ జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?

నేను ఆ ఇమేజ్‌ను అంత సీరియ్‌సగా తీసుకోను. రాజకీయాల్లో(Politics) అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇది హోదా(Status)ను బట్టి వస్తుంది. నా స్థానంలో ఎవరున్నా.. పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ హోదాలో నేను తుమ్మినా, దగ్గినా జనం...అహా! ఏం తుమ్మారు? ఏం దగ్గారు అని పొగుడుతారు. ఇది హోదాతో వచ్చిన గౌరవం. నా స్థానంలో ఇంకొకరు ఉన్నా అలాగే చేస్తారు. ఇది నా గొప్పతనం కాదు. హోదాతో వచ్చిన గొప్పతనం. అయితే రాజకీయ జీవితం(Political Life) శాశ్వతం కాదు. ఐదు, పదేళ్లు ఉంటుంది. మహా అయితే 20 ఏళ్లు. ఇదే శాశ్వతం కాదన్న విషయం నాకు తెలుసు. ఇదే శాశ్వతమన్న భావన ఉంటే తర్వాత చాలా బాధ పడాల్సి వస్తుంది.


అమెరికాలో ఉన్నప్పుడు మీకు  నచ్చిన అంశం?

అక్కడ ఉన్నప్పుడు వైట్‌ హౌస్‌(White House) డిన్నర్‌ చూసేవాడిని. అధ్యక్షుడు ఇచ్చే విందు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఏటా అక్కడ వైట్‌హౌస్‌ విందు ఇస్తుంటారు. ఆ పద్ధతి బాగా నచ్చింది. కానీ వెళ్లే అవకాశం రాలేదు.


మీ ఫేవరెట్‌ బిర్యానీ ఎక్కడ?

హైదరాబాద్‌ బిర్యానీ(Biryani) ప్రపంచంలోనే బెస్ట్‌. ఇక నా విషయానికంటారా?... షాగౌజ్‌, అజీజియా, బావర్చీ, ప్యారడైజ్‌(Paradise) అన్నీ నచ్చుతాయి. 

పొలిటీషియన్‌ అంటే  సాధారణంగా ప్రజల్లో కొంత నెగటివ్‌ భావన ఉంటుంది. ఆ ఇబ్బంది ఉందా?

పొలిటీషియన్‌ పదాన్ని బూతుగా ఎందుకు భావిస్తారు? కొందరు నాకు ట్విట్టర్‌లో ఇలాంటి భావనతోనే మాట్లాడతారు. పొలిటీషియన్‌ అంటే ఒక బూతుపదంగా కొందరు మార్చేశారు. అయితే నాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాలేదు.


నాన్నతో మీ బంధం... ఎలా ఉంది? 

ఆయనతో భేదాభిప్రాయాలున్నాయా?

ఆయన నాకు నాన్న మాత్రమే కాదు.. బాస్‌ కూడా. 

 కొన్ని సందర్భాలను బట్టి భేదాభిప్రాయాలు

ఉంటాయి. నాకూ-నా పిల్లలకూ కూడా ఉంటాయి. అయితే నాకు, మా నాన్నకు అవి చాలా తక్కువ.  కేసీఆర్‌ రాజకీయాల్లో చాలా సీనియర్‌, ఎంతో అనుభవం గడించారు. వారి దృక్పథం వేరుగా ఉంటుంది. నేను, నా ఆలోచనలు కాస్త వేరుగా ఉంటాయి. ఆయన నాబాస్‌ కాబట్టి. పార్టీలో, ప్రభుత్వంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని నేను తుచ తప్పకుండా పాటించాల్సిందే. 


 మీ ఇద్దరిలో సారూప్యతలేంటి?

నేను ఆయనతో పోల్చుకోలేను. ఆయన మొదటి తరం నాయకుడు. తన సామర్థ్యంతో ఇదంతా సృష్టించారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పుడు నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం. 


మీ తీరని కోరిక?

బ్రిటన్‌ రాణిని కలవాలన్నదే. ఇటీవల యూకే పర్యటనకు వెళ్లాను. కానీ సాధ్యపడలేదు. 

Updated Date - 2022-07-23T10:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising