ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ బాటలోనే తెలంగాణ ధాన్యం కొనాలి

ABN, First Publish Date - 2022-03-19T23:18:59+05:30

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అత్యవసర భేటీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలోనే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్  కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అత్యవసర భేటీ జరిగింది. ఈ మీటింగ్‌ లో పాల్గొన్న మంత్రులకు  సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ నెల 21న తెలంగాణ భవన్ లో జరిగే టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో  రూపకల్పన చేయనున్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగొళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి డిమాండ్ చేయనున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.


 తెలంగాణ ధాన్యాన్ని100 శాతం ఎఫీసీఐ సేకరించాలి

తెలంగాణ ధాన్యాన్ని 100 శాతం ఎఫీసీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవ్వాలని, ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-19T23:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising