ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మునుగోడు ప్రజలకు ఏం చేస్తారో ఇద్దరూ చెప్పలేదు: కాంగ్రెస్

ABN, First Publish Date - 2022-08-22T21:14:56+05:30

Hyderabad: మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిని సభల్లో సీఎం కేసీఆర్, కేంద్రం మంత్రి అమిత్ షా సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్, కేంద్రం మంత్రి అమిత్ షా సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మునుగోడు‌లో గెలిస్తే ఏం చేస్తామని కేసీఆర్ కానీ, అమిత్ షా కానీ చెప్పకపోగా.. ఒకరిపై ఒకరు విమర్శలకు పరిమితమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలవకూడదని బీజేపీ, టీఆర్ఎస్‌లు ఒకరినినొకరు తిట్టుకుంటూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు‌లో బీజేపీ‌కి ఓటు వేసినా .. టీఆర్ఎస్‌ను గెలిపించినా  సామాన్యుడికి న్యాయం జరగదన్నారు. ఒక బాధ్యతయుత ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అమిత్‌షా చెప్పులు మోయడమంటే..తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్‌షా కాళ్ల దగ్గర పెట్టడమేనన్నారు. మునుగోడు‌లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే సామాన్య ప్రజల‌కు న్యాయం జరుగుతుంది.టిపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ.. బీజేపీ గెలిస్తే మోటార్లను మీటర్లు పెడతారని చెప్పడం కొత్తేమి కాదని, సెంటిమెంట్‌తో కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండే వాడని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి ? రాష్ట్రంలో ప్రతి స్కాం లో టీఆర్ఎస్ నాయకులే ఉన్నారని ఆరోపించారు.  

Updated Date - 2022-08-22T21:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising