ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో బాష్‌ అభివృద్ధి కేంద్రం

ABN, First Publish Date - 2022-02-09T07:26:46+05:30

పారిశ్రామిక, ఇంజనీరింగ్‌, గృహోపకరణాల వంటి రంగాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మూడువేల మందికి ఉపాధి అవకాశాలు: మంత్రి కేటీఆర్‌ 

 

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక, ఇంజనీరింగ్‌, గృహోపకరణాల వంటి రంగాల్లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బాష్‌.. రాష్ట్రంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తమ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తన సాఫ్ట్‌వేర్‌ విభాగానికి సంబంధించి సుమారు మూడువేల మందితో హైదరాబాద్‌లో ఒక క్యాంప్‌సని స్థాపిస్తామని తెలిపింది. బాష్‌ కంపెనీ సీనియర్‌ ప్రతినిధుల బృందంతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. 


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన మౌలిక వసతులతో పాటు మానవ వనరులు ఉన్నాయని, గతంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అత్యంత వేగంగా విస్తరించాయన్నారు. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ నిర్ణయంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీతో దాదాపు మూడువేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.


Updated Date - 2022-02-09T07:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising