ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో స్టేషన్లలో పుస్తక ప్రదర్శనలు: ఎన్వీఎస్‌ రెడ్డి

ABN, First Publish Date - 2022-08-10T09:44:21+05:30

మెట్రో స్టేషన్లలో పుస్తక ప్రదర్శనలకు అవకాశం కల్పించనున్నట్టు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మెట్రో స్టేషన్లలో పుస్తక ప్రదర్శనలకు అవకాశం కల్పించనున్నట్టు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. మెట్రో నిర్మాణంలో తన అనుభవాలను ‘మేఘపథం’ పేరుతో ఎన్వీఎస్‌ రెడ్డి కవిత్వీకరించారు. ఈ పుస్తకా న్ని మంగళవారం ఆచార్య ఎన్‌.గోపి, శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాదరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌ మెట్రో కోసం ఎన్వీఎస్‌ రెడ్డి పడిన కష్టాలన్నీ.. వ్యాక్సిన్‌ తయారీ రంగంలో తానూ అనుభవించినట్లు చెప్పారు. ఎన్వీఎస్‌ రెడ్డిని దార్శనికుడిగా కొనియాడారు. ఆచార్య ఎన్‌.గోపి మా ట్లాడుతూ... ఎన్వీఎస్‌ రెడ్డిది భావావేశాలతో తడిసిన కవిత్వంగా అభివర్ణించారు. గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ... పక్షి వెన్నెముక నమూనాతో ఆకాశమార్గాన వంతెన నిర్మించిన సాహసి ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. మెట్రో స్టేషన్లలో పుస్తక ప్రదర్శనలకు వెసులుబా టు కల్పించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ కోరగా ఎన్వీఎస్‌ రెడ్డి అంగీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మెట్రో నిర్మాణ క్రమంలో రాజకీయ, న్యాయ, పరిపాలనా విభాగాల నుంచి అవాంతరాలు ఎదురైనట్టు చెప్పారు. 

Updated Date - 2022-08-10T09:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising