ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆషాఢబోనాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-20T21:17:09+05:30

తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించే ఆషాఢం బోనాల జాతర ఉత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించే ఆషాఢం బోనాల జాతర ఉత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ముందుగా గోల్కొండ కోట నుంచి బోనాల ఉత్సవాల ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయనుంది. ఏర్పాట్లపై ఈ నెల 21 వ తేదీన ఉదయం 11.00 గంటలకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వద్ద జరగనున్నాయి. 


ఈ సమావేశంలో దేవాదాయ, GHMC, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులు పాల్గొననున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన,శాంతిభద్రతలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-06-20T21:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising