ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana News: బీజేపీ-టీఆర్‌ఎస్ నేతల ఘర్షణ

ABN, First Publish Date - 2022-07-20T21:42:03+05:30

మంచిర్యాల ఐబీలో బీజేపీ-టీఆర్‌ఎస్ (BJP-TRS) నేతలు ఘర్షణకు దిగారు. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: మంచిర్యాల ఐబీలో బీజేపీ-టీఆర్‌ఎస్ (BJP-TRS) నేతలు ఘర్షణకు దిగారు. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేశారు. అయితే జీఎస్టీ (GST) పెంపును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు కూడా నిరసన తెలిపారు. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నారు. రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు. జిల్లాలో గతవారం రోజుల నుంచి కురిసిన భారీవర్షాలు (Heavy Rain), వరదల కారణంగా జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం కారణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచనాలను సర్కారుకు నివేదించారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, కందుల పంటలు పెద్దఎత్తున దెబ్బతినడంతో ఇక మళ్లీ ఆ పంటలను సాగుచేయడం రైతులకు సవాలుగా మారనుంది. పంటలసాగు ఆలస్యంకానున్నందున దిగుబడుల సమయం మరింత దూరమవుతుందని చెబుతున్నారు.

Updated Date - 2022-07-20T21:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising