ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడులో బోగస్‌ ఓట్లకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్ర: కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2022-10-07T08:26:16+05:30

మునుగోడులో మొక్కుబడి పరిశీలన పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద ఎత్తున బోగస్‌ ఓటర్లను చేర్పించేందుకు కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జగిత్యాల టౌన్‌, కృష్ణ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో మొక్కుబడి పరిశీలన పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద ఎత్తున బోగస్‌ ఓటర్లను చేర్పించేందుకు కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఆరోపించారు.  బోగస్‌ ఓటర్ల నమోదుపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అధికారులు మొక్కుబడి పరిశీలన కారణంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు బోగస్‌ ఓటర్లను చేర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. బోగస్‌ ఓట్ల నమోదును నియంత్రించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరపున ఒక బృందాన్ని పంపించి దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిరంజన్‌ డిమాండ్‌ చేశారు.


బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌ అని, బీజేపీతో కేసీఆర్‌ ఫైట్‌ డూప్‌ మాత్రమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. దేశంలో కేసీఆర్‌కు ఏ పార్టీ కూడా సహకరించడం లేదని విమర్శించారు.  తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల రైతులకు పంచారని, విమానాలు కొంటున్నారని వీహెచ్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో ఎనిమిదేళ్లుగా తెలంగాణకు పట్టిన శని వీడిందని, ప్రజలకు కేసీఆర్‌ నుంచి ఇక విముక్తి కలుగనుందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడంలో విఫలమైన కేసీఆర్‌ కొత్తగా బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో దేశ రాజకీయాల్లోకి వెళుతున్నారని, ఆనాడు ఎన్టీఆర్‌కు పట్టిన గతే నేడు కేసీఆర్‌కు పట్టక తప్పదన్నారు. కాగా, రాహుల్‌గాంధీ భారత్‌జోడో పాదయాత్ర నేపథ్యంలో నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు పరిధిలోని సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టు వద్ద గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. 

Updated Date - 2022-10-07T08:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising