ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: దుష్ర్పచారంపై ఆగ్రహం.. కార్యకర్తల చెప్పులూ చేతులతోనే ఇస్తా

ABN, First Publish Date - 2022-08-22T23:47:19+05:30

లిక్కర్‌ స్కామ్‌ (liquor scam)ను పక్కదారి పట్టించేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: లిక్కర్‌ స్కామ్‌ (liquor scam)ను పక్కదారి పట్టించేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Telangana Chief Bandi Sanjay) మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబంపై ఆరోపణలు వచ్చాయని..  దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రతీ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌కు సంబంధం ఉందని చెప్పారు. లిక్కర్ షాపుల కోసమే సీఎం కేసీఆర్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బండిసంజయ్ వ్యాఖ్యానించారు. 


పంజాబ్‌‌లోనూ లిక్కర్ స్కామ్ ?

పంజాబ్‌ (Punjab)లోనూ లిక్కర్ స్కామ్ చేసినట్లు అనుమానాలున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ‘‘కుటుంబీకులపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ (Minister Ktr) ఎందుకు ట్వీట్ చేయడం లేదు?. రామచంద్ర పిళ్లై, సృజన్‌రెడ్డి, అభిషేక్‌తో సంబంధాలు ఉన్నాయా? లేదా?. లిక్కర్‌ స్కామ్‌లో కాంగ్రెస్‌ నేతల ప్రమేయం కూడా ఉంది. టీఆర్ఎస్ (Trs), కాంగ్రెస్ (Congress) నాయకులు కలిసే లిక్కర్ స్కామ్‌ చేశారు.’’ అని బండి సంజయ్ ఆరోపించారు. 


అమిత్‌ షా నాకు ఆదర్శ నాయకుడు

కేంద్రమంత్రి అమిత్‌ షా (Central Minister Amit Shah) తనకు ఆదర్శ నాయకుడు అని బండి సంజయ్ అన్నారు. గురు సమానులు కాబట్టే చెప్పులు అందించానని ఆయన చెప్పారు. ‘‘పాదయాత్రలో కార్యకర్తల చెప్పులు కూడా నా చేతులతోనే ఇస్తా.  మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం. మీలా అవసరం తీరాక కాళ్లు పట్టి లాగే అలవాటు లేదు.  కేసీఆర్‌లా అవసరాన్ని బట్టి పొర్లి దండాలు పెట్టడం మా రక్తంలో లేదు. ప్రొ.జయశంకర్, కొండా లక్ష్మణ్‌ను అవమానించిన మీకు గౌరవాల విలువ ఏం తెలుస్తుంది?. అమిత్‌షా, జూ.ఎన్టీఆర్ (Ntr) సమావేశంలో రాజకీయం లేదు.’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.



Updated Date - 2022-08-22T23:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising