ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి నడుస్తాం: నారాయణ

ABN, First Publish Date - 2022-03-05T01:02:35+05:30

బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి నడవడానికి తాము సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ: బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి నడవడానికి తాము సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. దేశంలో కొత్తగా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో లక్షల కోట్ల రియల్‌ వ్యాపారానికి సన్నాహాలు జరిగాయని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ముందుగా అప్రమత్తం చేసినట్లయితే అక్కడి మన విద్యార్థులను భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు బీజేపీకి వ్యతిరేకమైన కూటమి ఏర్పాటు కోసం ఎందుకు కలిసి వెళ్లడం లేదని నారాయణ ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-05T01:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising