ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: రాజాసింగ్ న్యాయవాదికి బెదిరింపులు.. చంపేస్తామని హెచ్చరిక

ABN, First Publish Date - 2022-08-24T20:37:57+05:30

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Bjp Mla Rajasingh) కేసు వాదించినందుకు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని న్యాయవాది కరుణసాగర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Bjp Mla Rajasingh) కేసు వాదించినందుకు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని న్యాయవాది కరుణసాగర్ (Advocate Karuna Sagar) అన్నారు. కాగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు.. ఓ వర్గాన్ని కించపర్చేలా ఉన్నాయని రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించింది. అయితే రాజాసింగ్ తరపున లాయర్ కరుణ సాగర్ కోర్టులో వాదనలు వినిపించారు. సాగర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. రాజాసింగ్‌ రిమాండ్‌ను రిజెక్ట్ చేయడంతో పాటు బెయిల్ మంజూరు చేసింది. దీంతో లాయర్ కరుణ సాగర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. చంపుతామని వార్నింగ్ ఇచ్చారు. 


ఈ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని లాయర్ కరుణ సాగర్ తెలిపారు. న్యాయవాది వృత్తిని తాను నెరవేర్చానని చెప్పారు. పోలీసుల వైఫల్యంతోనే రిమాండ్ రిజక్ట్  అయ్యిందన్నారు. ‘‘మంగళవారం నుంచి గుర్తు తెలియని ఆగంతకులు దుబాయ్ నుంచి కాల్స్ చేసి చంపుతా అని బెదిరిస్తున్నారు.  రాజా సింగ్ కేసు వాధించినందుకు బెదిరిస్తున్నారు. బెదిరింపులకు నేను భయపడను. దీనిపై పోలీసులు స్పందించాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.’’ అని కరుణ సాగర్ అన్నారు. 


Updated Date - 2022-08-24T20:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising