ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురమే కావొచ్చు... మందబలంతో శాసించలేరు: రఘునందనరావు

ABN, First Publish Date - 2022-03-15T19:21:44+05:30

భవిష్యత్తులో సీఎం కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకునే రోజు వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భవిష్యత్తులో సీఎం కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకునే రోజు వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘మేము ముగ్గురమే కావొచ్చు.. మంద బలంతో మమల్ని శాసించలేరు’’ అని హెచ్చరించారు.  స్పీకర్ కుర్చీని కేసీఆర్ రాజకీయాలకు వాడుకోవటం దుర్మార్గమన్నారు. శాసనసభలో అవమానాలకు భవిష్యత్‌లో టీఆర్ఎస్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వులపై స్పీకర్ తిరస్కరించటాన్ని చీకటి రోజుగా భావిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హక్కులను కాపాడాల్సిన వారే కాలరాయటం బాధాకరమన్నారు. ‘‘మా మా సీట్లలో కూర్చుంటే ఎలా సస్పెండ్ చేస్తారు. హైకోర్టు ఉత్తర్వులపై మా వాదనలతో స్పీకర్ ఏకీభవించలేదు. గతంలో నల్ల, ఆకుపచ్చ కండువాలు వేసుకుని వచ్చిన విషయాన్ని స్పీకర్‌కు గుర్తుచేశాం’’ అని తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే రఘునందనరావు వెల్లడించారు. 

Updated Date - 2022-03-15T19:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising