ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాలు పడుతుంటే పట్టించుకోరా..?.. మంత్రులపై రఘునందన్ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-07-13T23:59:37+05:30

రాష్ట్రంలో వర్షాలు కురుస్తుంటే మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghu Nandhan Rao) అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రంలో వర్షాలు కురుస్తుంటే మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghu Nandhan Rao) అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల (presidential Elections)కు జరిగిన మాక్ పోలింగ్‌ (Mock Polling)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిందని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భయంకరమైన వర్షాలు కురుస్తుంటే మంత్రులు పట్టించుకోవడం లేదని, వర్షాలకు ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు మాక్ పోలింగ్ జరిగిందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తాని ఆయన తెలిపారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో 5% ఓట్లు చెల్లుబాటు కాలేదని గుర్తు చేశారు. నూరు శాతం ఓటింగ్ నమోదు కావాలనే ప్రక్రియతో శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు.


దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆమెకు ఓటు వేయాలని రఘునందన్ రావు కోరారు. రాష్ట్రానికి సంబంధించిన గిరిజన నాయకులంతా ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  విజ్ఞప్తి చేశారు. 




Updated Date - 2022-07-13T23:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising