ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ పల్లెల్లో బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయి: BJP leader

ABN, First Publish Date - 2022-04-04T19:07:03+05:30

తెలంగాణ పల్లెల్లో బెల్ట్ షాపులు ఎక్కువ అయ్యాయని బీజేపీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పల్లెల్లో బెల్ట్ షాపులు ఎక్కువ అయ్యాయని బీజేపీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్, రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్లు రావొద్దని సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. గిరిజనుల రిజర్వేషన్లు కేంద్రంపై నెపం నెట్టి కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారన్నారు.  ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహా... అన్ని రాష్ట్రాలలో గిరిజనులకు ప్రత్యేక కమిషన్ ఉందని తెలిపారు. మద్యం దుకాణాలలో గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చారని బీజేపీ నేత అన్నారు. ఈ విషయంలో అధికార నేతలు కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేస్తుండటం దారుణమని మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. కులాల మధ్య గొడవలు పెట్టే నైజం కేసీఆర్‌ ది అని... రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడం మినహా ఆచరణలో శూన్యమని బీజేపీ నేత రవీంద్ర నాయక్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-04T19:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising