ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ ఘటన వెనుక రాజకీయ కోణం: మురళీధర్ రావు

ABN, First Publish Date - 2022-01-12T23:26:57+05:30

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పంజాబ్‌లో జరిగిన ఘటనల వెనుక రాజకీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పంజాబ్‌లో జరిగిన ఘటనల వెనుక రాజకీయ కోణం ఉందని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు ఆరోపించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని సెక్యూరిటీపై పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నాయకత్వం రాజకీయం చేయడం తగదన్నారు. ఫెడరల్‌ సిస్టమ్‌లో బాధితులపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ జరుగుతోందని, బాధితులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.


ప్రధాని మోదీ పర్యటనలో పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్‌లు ఎందుకు స్వాగతం  చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఘటన జరిగిన ఫిరోజ్‌పూర్  పట్టణం పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. మోదీ పర్యటనపై డిసెంబర్ 30న పంజాబ్ డీజీపీకి ఎస్పీజీ లేఖ రాసిందని ఆయన తెలిపారు. పార్టీ నాయకుడు మాత్రమే కాదు.. నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ భద్రత అత్యంత ప్రధానమైనదని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-12T23:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising