ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయం: Laxman

ABN, First Publish Date - 2022-07-01T17:10:12+05:30

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ(Modi) సభ ఉండబోతోందని బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ (Laxman) అన్నారు. శుక్రవారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా (Nadda), అమిత్ షా(Amit shah)లు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్(TRS) పతనం ప్రారంభమైందని... హార్డింగ్స్, ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్ ది చిల్లర రాజకీయమని ఆయన మండిపడ్డారు.


రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేయనున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు బీ పార్టీగా టీఆర్ఎస్, ఎంఐఎంలు వ్యవహరిస్తున్నాయన్నారు. కుటుంబ పార్టీలు కనుమరుగవటం‌ ఖాయమని తెలిపారు. పుత్ర వాత్సల్యం వలన శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఆదివాసీ రాష్ట్రపతి అవుతుంటే టీఆర్ఎస్ నాయకత్వం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆదివాసీని రాష్ట్రపతిని చేస్తోన్న ఘనత 70 ఏళ్ళల్లో బీజేపీకి దక్కుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-01T17:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising