ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ని నిర్బంధాలు, కేసులు పెట్టినా పోరాటం చేస్తాం: Laxman

ABN, First Publish Date - 2022-01-08T18:52:11+05:30

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని నిర్బంధాలు, కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటూనే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలకు లోబడే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముల్కీ నిబంధనలతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. 317 జీఓ కారణంగా అవే పరిస్ధితులు స్వరాష్ట్రంలో వస్తున్నాయన్నారు. నాడు శ్రీకృష్ణ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటే.. సొంత రాష్ట్ర సీఎం ఎవరినీ సంప్రదించలేదని గుర్తుచేశారు. నాడు స్థానిక అంశంపై పోరాటం చేస్తే.. ఇపుడూ అదే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని విమర్శించారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఆ రాజకీయ కారణాలే ఇప్పుడు ఉద్యోగులకు శాపం అయిందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాలుగు గోడల మధ్య కూర్చొని బదిలీలు చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-08T18:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising