ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనకు పవిత్రత లేదు: Indrasena reddy

ABN, First Publish Date - 2022-03-19T19:11:41+05:30

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనకు పవిత్రత లేదని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనకు పవిత్రత లేదని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ పలుకుబడి పడిపోయిందని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ యువతను ఎన్నికల్లో వాడుకోవటానికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోచింగ్ సెంటర్స్ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కల్పనపై గతంలో మంత్రి కేటీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండానే చేసినట్లు చెప్పటానికి ఇంకిత జ్ఞానం ఉండాలని మండిపడ్డారు. 33 జిల్లాల్లో కాకుండా పాత పది జిల్లాలో మాత్రమే స్టడీ సెంటర్స్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


రెండు నెలల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించి ఐదు నెలలు గడిచాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో పడొద్దని నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన ఎలా చేస్తారని నిలదీశారు. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారమే టెట్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ తయారు చేయకుండా సీఎం కేసీఆర్ పదే పదే మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్‌కు పీకే నివేదించారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-19T19:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising