ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోంది: Bandi sanjay

ABN, First Publish Date - 2022-06-17T19:34:27+05:30

రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తున్న బండిని బిక్కనూర్ టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను సిల్లీ అని తీసేసిన సిల్లి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని ఆయన నిలదీశారు.


ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా అని అన్నారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము ట్రిపుల్ ఐటికి వెళ్తున్నామని తెలిపారు. అక్కడ ఆందోళనలు, ధర్నాలు చేయడానికి మాకేమైన సీఎం మాదిరిగా పనిపాట లేదా అని అన్నారు. పోలీసుల నిర్బంధంతో అడ్డుకుంటున్నారని... బీజేపీని ఆపడం సీఎం తాతతరం కూడా కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-17T19:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising