ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi sanjay: తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్

ABN, First Publish Date - 2022-09-03T16:23:52+05:30

ఎంఐఎంకు భయపడే.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంఐఎం (MIM)కు భయపడే.. కేసీఆర్ (KCR)  తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తోన్న దుర్మార్గుడు కేసీఆర్ (Telangana CM) అని మండిపడ్డారు. ‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ (BJP) మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు కేసీఆర్ (TRS Chief) ప్లాన్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.


తెలంగాణ విమోచన దినోత్సవాల (Telangana Liberation Day)ను అధికారికంగా నిర్వహించకుండా కేసీఆర్ (TRS) తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ (CM KCR) సీఎం పీఠమెక్కినాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గమని విరుచుకుపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడానికి అసలు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ (Telangana cm KCR) సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకపోవడం సిగ్గు చేటని అన్నారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే గతంలో ఇచ్చిన మాట మేరకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తీరాలని పట్టుబడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాట, సాంస్క్రుతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Union minister kishan reddy) సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T16:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising