ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన Bandi sanjay

ABN, First Publish Date - 2022-06-13T18:20:00+05:30

గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi sanjay) ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు.


రజకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా ఇట్లాంటి అరాచకాలు చేయలేదేమో... ఇకనైనా కేసీఆర్ ఫాంహౌజ్ నుండి పాలించడం మానుకోవాలని హితవుపలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-13T18:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising