ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ఫైర్‌

ABN, First Publish Date - 2022-08-04T10:26:05+05:30

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సమాజం అసహ్యించుకునేలా రేవంత్‌ వ్యాఖ్యలు :  ఈటల 
  • రాజకీయాల్లో విలువలులేని వ్యక్తి రేవంత్‌ : రఘునందన్‌ రావు
  • రాజ్‌గోపాల్‌ చేరికను జీర్ణించుకోలేక పోతున్నారు :  డీకే అరుణ 
  • ఆయనో బ్లాక్‌మెయిలర్‌ : రాజాసింగ్‌


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సమాజం అసహ్యించుకునేలా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు. ఆయన బ్లాక్‌మెయిల్‌ చేసి ఎదిగి ఈ స్థాయికి వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్‌ దుర్మార్గాలను ఎండగట్టడమే తమ ఎజెండా అని, హుజూరాబాద్‌ డ్రామాలు మునుగోడులో నడువన్నారు. తమతో గోక్కుంటే మాడి మసైపోతారని సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. రాజకీయాల్లో విలువలు, వలువలు లేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌ రావు విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రె్‌సలో చేరి.. 14 నెలలపాటు టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న చరిత్ర ఆయనదని చెప్పారు. 


బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల నుంచి చాలా మంది తమ పార్టీలోకి వస్తారు. వుునుగోడు ఫలితం తర్వాత టీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వస్తారా లేదా అన్నది మునుగోడు ఫలితం తర్వాత తేలుతుంది’’ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రేవంత్‌రెడ్డి పూర్తిగా సమన్వయం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరికను జీర్ణించుకోలేక రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేసే అర్హత రేవంత్‌కు లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డి తన అసమర్థతను, బ్లాక్‌ మెయిల్‌ మనస్తత్వాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరని తెలిపారు.  బీజేపీ జోలికొస్తే ఖబర్దార్‌... రేవంత్‌ రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో ఊసరవెల్లి కంటే కూడా వేగంగా రంగులు మార్చే నైజం రేవంత్‌ రెడ్డిదన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.  

Updated Date - 2022-08-04T10:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising