ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీది ఫేక్ వాట్సప్ ప్రచారం: మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2022-02-03T23:45:12+05:30

రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ఫేక్ వాట్సప్ ప్రచారం చేస్తోందని, దాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ఫేక్ వాట్సప్ ప్రచారం చేస్తోందని, దాని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని హరీష్‌రావు అన్నారు. ఏ అంశంలో చూసినా తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. బీజేపీ నేతలు మాత్రం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడి బండి, గుండు మాటలు చెప్పమంటే కోటలు దాటుతాయని ఆయన ఎద్దేవా చేశారు. తాము అడ్డుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం గురించి సీఎం కేసీఆర్ ఏం తప్పు మాట్లాడారని ఆయన నిలదీశారు. తాను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, అవసరమైతే రద్దు చేయాలని అంబేద్కరే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-02-03T23:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising