ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేదు అనుభవాలే రచనకు పునాది

ABN, First Publish Date - 2022-10-11T10:14:41+05:30

సాహితీకారుడిగానే కాకుండా విద్యావేత్తగానూ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ విశిష్ట సేవలు అందించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌
  • ఇనాక్‌కు ‘ఆకృతి - గురజాడ’ పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు10 (ఆంధ్రజ్యోతి): సాహితీకారుడిగానే కాకుండా విద్యావేత్తగానూ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ విశిష్ట సేవలు అందించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. తెలుగు సాహిత్యరచనలో ఆచార్య కొలకలూరి ఇనాక్‌ దృక్పథం, శైలి విభిన్నమైనవవి అని.. కథ, నవల, కవిత్వం, విమర్శనా వ్యాసాలు.. ఇలా ఆయన ఏ ప్రక్రియలో రాసినా, అందులో తనదైన ముద్ర సుస్పష్టం అని వక్తలు ప్రశంసించారు. ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్‌కు సోమవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ‘ఆకృతి - గురజాడ’ పురస్కారాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రదానం చేశారు. అనంతరం ఇనాక్‌ మాట్లాడారు. బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాలే రచనా వ్యాసంగానికి పునాది అని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, ఆకృతి సుధాకర్‌, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీశ్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-11T10:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising