ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

floods: భూపాలపల్లి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

ABN, First Publish Date - 2022-07-21T22:17:06+05:30

భూపాలపల్లి (Bhupalpally District) జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలకు దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాలపల్లి: భూపాలపల్లి (Bhupalpally District) జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలకు దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లు, పొలాల పరిశీలించారు. వరద (flood) నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరద నష్టంపై కలెక్టర్‌ భవిష్‌ మిశ్రాతో కేంద్ర బృందం చర్చించింది. రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. వరదల వేళ తీవ్రంగా నష్టపోయిన భద్రాచలంతోపాటు కడెం ప్రాజెక్టు (Kadam Project)ను ఆ బృందం సందర్శించనుంది. 


వరదలు రైతుల్లో కన్నీళ్లు మిగిల్చాయి. వరద దుస్థితి కారణంగా పచ్చని పంట పొలాలు దెబ్బతిని రైతులు నష్ట్టపోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే వరినారుమళ్లు, వరినాట్లు, జామాయిల్‌, మామిడితోటలు వరద ఉధృతికి పనికిరాకుండా పోయాయి. పశుగ్రాసం కూడా నాశనమైంది. మరోవైపు కేంద్ర, రాష్ట్రాల మధ్య వరద నిధుల పంచాయితీ మొదలయింది. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న రాష్ట్ర సర్కారు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు ఎలాంటి సాయం చేయడం లేదంటూ అక్కసు వెళ్లగక్కడం.. అనేక వాగ్వాదాలకు దారితీసింది. పరస్పర వ్యంగ్యాస్త్రాలు, తీవ్ర విమర్శలు, రాజకీయ వేడి పెంచేందుకు కారణమైంది.

Updated Date - 2022-07-21T22:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising