ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర

ABN, First Publish Date - 2022-02-26T23:58:19+05:30

ప్రజా సమస్యలను క్షేత్రాస్థాయిలో తెలుసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై పోరాడాలనే లక్ష్యంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ప్రజా సమస్యలను క్షేత్రాస్థాయిలో తెలుసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై పోరాడాలనే లక్ష్యంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఆదివారం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్ర కోసం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 32రోజుల పాటు మొత్తం 506 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ముదిగొండ మండలం యడవల్లి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముగింపు సభ నిర్వహించనున్నారు. భట్టి తన పాదయాత్రలో ప్రతిరోజు 15నుంచి 20 కి.మీ.పైగా ప్రయాణం సాగించి ఆయా గ్రామాల్లోనే బస చేస్తారు. పర్యటలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలుతీరు, ప్రజాసమ్యలను భట్టి విక్రమార్క ప్రత్యక్షంగా తెలుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. ప్రధానంగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగభృతి, ఉద్యోగవకాశాల కల్పన, రైతులకుగిట్టుబాటు ధరలు, పెరిగిన నిత్యావసర ధరలు, ఆరోగ్యశ్రీ పథకం తీరు, విద్యార్థులకు ఫీజురీయింబర్సుమెంట్‌ వంటి పథకాల అమలు తీరును పరిశీలించనున్నారు.

Updated Date - 2022-02-26T23:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising