ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu naidu: చంద్రబాబును కలిసిన భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-07-29T16:18:22+05:30

పోలవరం విలీన మండలాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రికొత్తగూడెం: పోలవరం విలీన మండలాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌(TDP Chief)ను భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress mla) పొదేం వీరయ్య (Pondem veeraiah) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణ(Telangna)లో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును పొదేం వీరయ్య విజ్ఞప్తి చేశారు. 


మరోవైపు భద్రాచలంలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటరీ పార్టీ(Telangana Parliamentary Party) అధ్యక్షులతో విడిగా సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన ఐదు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబుకు వివరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చొరవ చూపాలని నేతలకు టీడీపీ అధినేత సూచన చేశారు. సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకావాలని నేతలు కోరగా... తప్పక హాజరవుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.  ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

Updated Date - 2022-07-29T16:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising