ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-08-01T00:15:19+05:30

మంత్రి సబిత ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాసర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాసర త్రిపుల్ ఐటీ కాలేజీ (Basra IIIT College) విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సబిత ఇంటికి భారీ ర్యాలీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‎కు తరలించారు. 


ఇటీవల కాలంలో బాసర త్రిపుల్ ఐటీలో పురుగుల అన్నం తినడం వల్ల విద్యార్థులు (Students) అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీ హాస్టల్ మెస్‎లో నాణ్యమైన భోజనం (Quality Food) పెట్టడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలను ఉధృతం చేశారు. యూనివర్సిటీకి పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్‌ను (Vice Chancellor) నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ లేకపోవడం వల్ల యూనివర్సిటీలో వసతులు, సౌకర్యాలు సరిగాలేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అలాగే మెస్ కాంట్రాక్టర్ ను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం రాత్రి ఆందోళనను ఉధృతం చేశారు. యూనివర్సిటీలో హాస్టల్ హాల్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పినా వినకుండా ఆందోళనను కొనసాగించారు. 


అయితే తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. 




Updated Date - 2022-08-01T00:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising