ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన

ABN, First Publish Date - 2022-07-16T20:21:49+05:30

సమస్యలు తీర్చాలంటూ ఇటీవల పెద్దఎత్తున ఉద్యమించిన బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర: సమస్యలు తీర్చాలంటూ ఇటీవల పెద్దఎత్తున ఉద్యమించిన బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అడ్మినిస్ట్రేషన్‌ (Administration) బ్లాక్‌ ముందు విద్యార్థులు (students) నిరసన తెలిపారు. నాసిరకం సరుకులు వాడటం వల్లనే ఫుడ్ పాయిజనింగ్ అయిందని విద్యార్థులు నిరసనకు దిగారు. గడువు తీరిన వంట సరుకులు, కుళ్లిన కోడిగుడ్లు, నూనె ప్యాకెట్లతో నిరసన తెలిపారు. మెస్ కాంట్రాక్టు సంస్థలను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం వందలాది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో 600 మంది అస్వస్థులయ్యారు. యూనివర్సిటీ మెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 వేల మంది విద్యార్థులు భోజనం చేశారు. 


తర్వాత హాస్టళ్లకు వెళ్లిన వీరిలో ఒక్కొక్కరుగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో అధ్యాపకులు తమ కార్లలో వర్సిటీలోని ఆస్పత్రికి తరలించారు. 9 మంది విద్యార్థులకు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థులైన మరో వందమందిలో కొందరిని నిజామాబాద్‌ (Nizamabad), నవీపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఇంకొందరిని ట్రిపుల్‌ ఐటీలోని ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 400-500 మంది స్వల్ప అనారోగ్యానికి గురికాగా, చికిత్స అనంతరం హాస్టళ్లకు పంపించేశారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడమే ఈ ఘటనకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-07-16T20:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising