ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Banjarahills‌: అప్పు చెల్లించినా బెదిరింపులు

ABN, First Publish Date - 2022-06-07T14:43:44+05:30

తీసుకున్న అప్పు చెల్లించినా చెక్కులు ఇవ్వకుండా బెదిరిస్తున్న ఇద్దరు మహిళలపై కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు మహిళలపై కేసు 

హైదరాబాద్/బంజారాహిల్స్‌: తీసుకున్న అప్పు చెల్లించినా  చెక్కులు ఇవ్వకుండా బెదిరిస్తున్న ఇద్దరు మహిళలపై కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ పంచవటి కాలనీకి చెందిన పులంశెట్టి శౌరిరాజ్‌ వ్యాపార అభివృద్ధి నిమిత్తం కొడాలి శ్రీదేవి, రసగ్నసాయి వద్ద రూ. 7,30,500 అప్పుగా తీసుకున్నాడు. ఇందుకుగాను రెండు చెక్కులు, ప్రామిసరీ నోట్‌ ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా తీసుకున్న అప్పు చెల్లించాడు. చెక్కులు తిరిగి ఇవ్వాలని కోరగా.. శ్రీదేవి అంగీకరించలేదు. వడ్డీ అంటూ భరత్‌చౌదరి అనే వ్యక్తి ఖాతాలో రూ. 4.48 లక్షలు వేయాలని చెప్పింది. శౌరిరాజ్‌ డబ్బులు చెల్లించాడు. తర్వాత రూ. 43 వేలు ఒకసారి, రూ. 19 వేలు మరోసారి డిమాండ్‌ చేస్తూ మొత్తం రూ. 15 లక్షలు వసూలు చేసింది. చెక్కులు అడిగితే బెదిరిస్తోంది. శ్రీదేవికి రసగ్నసాయి తోడ్పాటు అందిస్తోంది. న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదాలు విన్న కోర్టు నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-07T14:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising