ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్ జైలు నుంచి విడుదల

ABN, First Publish Date - 2022-01-06T01:30:25+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీవోను సవరించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీవోను సవరించాలని కరీంనగర్ పట్టణంలో బీజేపీ చేపట్జిన జన జాగరణ దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో మూడ్రోజుల పాటు బండి సంజయ్ జైల్లో ఉన్నారు. 


అయితే బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. సంజయ్‌ను విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జుడీషియల్ రిమాండ్‌పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీ 40 వేల బాండ్‌పై విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. 


హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి భగవత్ కుభాతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. బండి సంజయ్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. 




Updated Date - 2022-01-06T01:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising