ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే వస్తుంది: సంజయ్

ABN, First Publish Date - 2022-05-22T18:06:14+05:30

కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ..లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణ ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో చేసిందేమీ లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారటని ఎద్దేవ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా పంజాబ్‌ రైతులకు ఎందుకు సాయం చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. గొప్పల కోసమే ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. ఇక తన అక్రమాస్తులు కాపాడుకోడానికే మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పెట్రోల్, డీజిల్‎పై ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-22T18:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising