ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని సభకు నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ

ABN, First Publish Date - 2022-06-20T00:54:13+05:30

ప్రధాని సభకు నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని సభకు నియోజకవర్గ ఇంచార్జ్ లను బీజేపీ నియమించింది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్లతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. 3న జరిగే మోదీ బహిరంగ సభకు ప్రతి ఇంటికీ ఆహ్వానం పంపాలని నిర్ణయం, అలాగే 50 లక్షల ఆహ్వాన పత్రికలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 10 వేల జన సమీకరణ ఉండేటట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. నభూతో నభవిష్యత్ అనేలా సభను సక్సెస్ చేసి కొత్త చరిత్ర స్రుష్టించాలని నిర్ణయం తీసుకున్నారు. 


జన సమీకరణ, విరాళాల సేకరణ, కార్యక్రమాల నిర్వహణపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ అధ్యక్షులు, సభ్యులు నుండి 1000, మండల స్థాయి నేతల నుండి 20 వేలు, జిల్లా నేతల నుండి 50 వేలు, రాష్ట్ర నేతల నుండి లక్ష రూపాయల చొప్పున విరాళాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఈసీ నిర్వహణలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతోనే విరాళాల సేకరణ అని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎన్ఈసీ కార్యవర్గ సమావేశాల సన్నాహక ఏర్పాట్లపై రోజంతా బండి సంజయ్ సమీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2022-06-20T00:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising