ఆన్ లైన్ లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సేవలు
ABN, First Publish Date - 2022-06-17T00:53:28+05:30
జంటనగరాల్లో ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran reddy) ప్రారంభించారు.
హైదరాబాద్: జంటనగరాల్లో ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran reddy) ప్రారంభించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం (balkam pet yellamma kalyanam) జులై 5న వైభవంగా నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్ లైన్ కళ్యాణం సేవలను బుక్ చేసువాలని తెలిపారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆన్ లైన్ సేవలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, మిస్రి, ఇతర డ్రై పూట్స్ ఇంటికి పంపిస్తారని చెప్పారు.
TAPP FOLIO, మీ సేవ,ఆలయ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ కళ్యాణ సేవలకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ డా.పీ.వీ.ఎస్ రెడ్డి, డిప్యూటీ కమిషర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మహంకాళీ ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, బల్కంపేట ఆలయ ఈవో అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-17T00:53:28+05:30 IST