ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అగ్నిపథ్’ ఆందోళనలకు కారణం కేంద్రమే: Balka Suman

ABN, First Publish Date - 2022-06-18T21:07:17+05:30

‘అగ్నిపథ్’ ఆందోళనలకు కేంద్రమే కారణమని ఎమ్మెల్యే బాల్క సుమన్ (MLA Balka Suman) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘అగ్నిపథ్’ ఆందోళనలకు కేంద్రమే కారణమని ఎమ్మెల్యే బాల్క సుమన్ (MLA Balka Suman) ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్‌ స్కీమ్‌ను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు. నిన్నటి ఘటనలకు టీఆర్ఎస్ (TRS) కారణమైతే.. వారణాసి, కాన్పూర్‌లో ఘటనలకు కూడా టీఆర్ఎస్సే కారణమా? అని ప్రశ్నించారు. బీజేపీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యాడని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.


సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై.. ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station)లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.




Updated Date - 2022-06-18T21:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising