ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిషన్‌రెడ్డి వాస్తవ విషయాలు చెప్పాలి: బాల్క సుమన్‌

ABN, First Publish Date - 2022-04-27T00:20:15+05:30

కిషన్‌రెడ్డి సింగరేణి కార్మికులకు వాస్తవ విషయాలు చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  కిషన్‌రెడ్డి సింగరేణి కార్మికులకు వాస్తవ విషయాలు చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మొద్దని లేఖ రాశారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు.సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు బ్లాకులను అమ్మొద్దని కోరాం అయిన కేంద్రం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన కిషన్‌రెడ్డి దద్దమ్మలా మాట్లాడుతున్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక మాట... కేంద్రంలో మంత్రిగా మరోమాట మాట్లాడితే సిగ్గనిపించడం లేదా.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ఆపాలి. కిషన్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలి.బీజేపీ భరతం పట్టడానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ కోసం నేను కొట్లాడా. రాహుల్ గాంధీ ఓయూకు వచ్చేముందు అమరవీరుల కుటుంబాలు ఇషన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో జగ్గారెడ్డి చెప్పాలి..తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరిగిన చెప్పులతో కొట్టారు. నా జీవితంలో ఇప్పటివరకు ఓటమిలేదు. నికార్సైన ఉద్యమ కారులం..ఉద్యమ కారుల మీద మాట్లాడే ముందు ఆలోచించాలి...మా మీద చిల్లర మాటలు మాట్లాడితే చూస్తూ ఉరుకొం. రైతుల పేరు మీద రాజకీయం చేయడం  రాహుల్ గాంధీ మానుకోవాలి. ఫస్ట్ మునిగిపోయే కాంగ్రెస్ పార్టీని కాపాడుకోండి జాతీయస్థాయిలో పార్టీని నడిపించే సత్తాలేక రాష్ట్రానికొచ్చి ఏం చేస్తావు’’ అని బాల్క సుమన్‌ మండిపడ్డారు.

Updated Date - 2022-04-27T00:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising