ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోడు’ మహిళలపై అధికారుల దాడి

ABN, First Publish Date - 2022-06-27T09:24:02+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు, మద్దుకూరు శివారుల్లో పోడు రగడ మరోసారి రాజుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలువురికి తీవ్ర గాయాలు 

పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు 

భద్రాద్రి జిల్లాలో ఘటనలు 


చండ్రుగొండ, జూన్‌ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు, మద్దుకూరు శివారుల్లో పోడు రగడ మరోసారి రాజుకుంది. ఈ అటవీ ప్రాంతాల్లోని పోడుసాగుదారులపై శుక్ర, శనివారాల్లో అటవీ ఆధికారులు దాడికి పాల్పడ్డ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. ఈ రెండు ప్రాంతాల్లో వలస ఆదివాసీలు గత 15 ఏళ్లుగా పోడుసాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ట్రాక్టర్లతో దుక్కులు దున్నే ప్రయత్నం చేయగా పోడు సాగుదారులైన మహిళలు తీవ్రంగా అడ్డుకున్నారు. దాంతో కోపోద్రిక్తులైన అధికారులు, సిబ్బంది ఆ మహిళలపై బెల్టులు, కర్రలతో దాడి చేయగా పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రాజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళలపై దాడికి పాల్పడ్డ అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆదివాసీలు, అటవీశాఖ సిబ్బంది చండ్రు గొండ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.  

Updated Date - 2022-06-27T09:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising