ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3కే టెక్నాలజీస్‌ డైరెక్టర్ల ఆస్తుల అటాచ్

ABN, First Publish Date - 2022-01-27T23:36:59+05:30

3కే టెక్నాలజీస్‌కి చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఆస్తులను ఈడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 3కే టెక్నాలజీస్‌కి చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపు కేసులో రూ.3.19 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అమెరికాకు అక్రమంగా రూ.52.47 కోట్లు తరలించారని అభియోగాలు మోపింది. కారుసాల వెంకట సుబ్బారావు, తేజస్ కె.కొడాలి, కడియాల వెంకటేశ్వరరావు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. విశాఖ సెజ్ అధికారుల సమాచారం మేరకు ఈడీ దర్యాప్తు చేసింది. ఎఫ్‌డీఐల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు తరలించినట్టు గుర్తించింది.


అమెరికాలో ఉన్న ముగ్గురు 3కే టెక్నాలజీస్‌ డైరెక్టర్లకు సమన్లు జారీ చేసినా స్పందించడం లేదని ఈడీ పేర్కొంది. ఫెమా యాక్ట్ నిబంధనల ప్రకారం ఏపీ, తెలంగాణలో 15 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికే వీసాల అక్రమాల కేసులో తేజస్ కె.కొడాలి అరెస్ట్ అయ్యాడు. తేజస్ కె.కొడాలిని న్యూజెర్సీలో ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసిందని ఈడీ తెలిపింది. వీసా కేసులో తేజస్ కె.కొడాలికి అమెరికా కోర్టులో శిక్ష పడిందని ఈడీ పేర్కొంది. 

Updated Date - 2022-01-27T23:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising