ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: మోదీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని

ABN, First Publish Date - 2022-09-12T17:54:38+05:30

తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) కేంద్ర విద్యుత్ బిల్లుపై(Electricity bill) స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) కేంద్ర విద్యుత్ బిల్లుపై(Electricity bill) స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (Chief Minister Chandrasekhar Rao) మాట్లాడుతూ.. మోదీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని ఆనాడే చెప్పానని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు (Telangana) అన్యాయం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే(Cabinet)తెలంగాణ గొంతు నులిమిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. సీలేరు పవర్ ప్రాజెక్ట్(Seeleru Power Project)సహా మండలాలను లాక్కున్నారని మండిపడ్డారు. విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏమిటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై మూకదాడులు చేస్తున్నారని, ఎదుటివారు చెబితే వినే సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలు అనే ముసుగులో.. రైతులను దోచుకునే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారని సీఎం కేసీఆర్ మోదీపై ఫైర్ అయ్యారు.

Updated Date - 2022-09-12T17:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising