ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణమ్మ ఒడిలో మరో అద్భుత ద్వీపం!

ABN, First Publish Date - 2022-02-22T07:40:14+05:30

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం... ఎటుచూసినా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 407 ఎకరాల విస్తీర్ణంలో చాకలిగట్టు 
  • పర్యాటక కేంద్రంగా మార్చే యోచనలో ప్రభుత్వం 


నల్లగొండ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం... ఎటుచూసినా ఆకాశాన్నంటే ఎత్తులో చెట్లు, సందడి చేసే పక్షుల కిలకిలా రావాలు.. ఆ అడవిని చీల్చుకుంటూ సుడులు తిరుగుతూ ప్రవహించే నీలిరంగు కృష్ణమ్మ జల సవ్వడులు.. ఇలాంటి అత్యద్భుతమైన సుందర దృశ్యాలకు నెలవైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాల జాబితాలో మరో కలికితురాయి చేరబోతోంది. సాగర్‌ సిగలో.. కృష్ణమ్మ ఒడిలో మరో అద్భుత పర్యాటక ప్రాంతం అందుబాటులోకి రాబోతోంది.


నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ డౌన్‌ పార్కు వద్ద ఉన్న తెలంగాణ లాంచీ స్టేషన్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ద్వీపం చాకలిగట్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. భౌగోళికంగా తెలంగాణ పరిఽధిలో ఉన్న ఈ చాకలి గట్టు జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండకు వెళ్లే మార్గంలో ఆ కొండకు కేవలం మూడు కి.మీ. దూరంలో 407 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో జింకల పెంపక కేంద్రం కూడా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం బుద్ధవనం 274 ఎకరాల్లో నిర్మించగా ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో బుద్ధవనం, చాకలిగట్టు, నాగార్జునకొండ ప్రాంతాలను టూరిస్ట్‌ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ యోచన. 


బోటింగ్‌, ట్రెక్కింగ్‌, రోప్‌వేలు

నాగార్జునకొండకు 3కి.మీ. దూరంలోని చాకలి గట్టుకు మధ్యన రోప్‌వేలు, బోటింగ్‌, ట్రెక్కింగ్‌ వంటివి ఏర్పాటు చేస్తే అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుందని పర్యాటక శాఖ యోచిస్త్తోంది. ఈ దిశగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


ఆది మానవుల ఆవాసం

చాకలిగట్టు ప్రాంతం మధ్య, కొత్త రాతి యుగాల్లో ఆదిమానవుల ఆవాసంగా ఉందని పురావస్తు, బౌద్ధ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి బృందం చేపట్టిన తవ్వకాల్లో పలు ఆధారాలు వెలుగు చూశాయి. గొడ్డళ్లు, బడిసెలు అరగదీసినట్టు బండరాళ్లపై ఏర్పడిన గుంతల ద్వారా గుర్తించారు. 


సీఎం అనుమతితో అభివృద్ధి

చాకలిగట్టు (ద్వీపం)ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే అంశంపై ప్రాథమిక నివేదికలు అందాయి. సమగ్ర నివేదికలు ఇవ్వాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించాం. ఈ ప్రాజెక్టు వివరాలు రాగానే సీఎం కేసీఆర్‌కు వివరించి చర్యలు తీసుకుంటాం. 

  - శ్రీనివాస్‌ గౌడ్‌, పర్యాటక మంత్రి 


Updated Date - 2022-02-22T07:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising