ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఇంటెలిజెన్స్ మరో ఫెయిల్యూర్..

ABN, First Publish Date - 2022-09-13T20:15:05+05:30

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్(Telangana Intelligence) ముందుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా అధికారులు చూడాల్సి ఉంటుంది. ఏవైనా ఆందోళనలు జరుగుతాయనుకుంటే వాటిని ముందుగానే పసిగట్టి పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం అలెర్ట్ అయి ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇబ్బంది లేకుండా చూస్తుంటారు. అయితే వీఆర్ఏలు తెలంగాణ వ్యాప్తంగా ఛలో అసెంబ్లీ(Chalo Assembly) కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ తెలంగాణ ఇంటెలిజెన్స్ మాత్రం పసిగట్టలేక పోయిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మూడు రోజుల ముందుగానే వీఆర్ఏలు అంతా బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కలలో ఉన్న అనేక మంది వీఆర్ఏ బంధువులలో మూడు రోజుల నుంచి మకాం వేశారు. అయినా తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించలేదు. ఫలితంగా నేడు విడతల వారీగా 6000 మంది వచ్చి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోలేకపోయారు. చివరకు మంత్రి కేటీఆర్ కల్పించుకుని వీఆర్ఏ ప్రతినిధులతో మాట్లాడటంతో కాస్త శాంతించారు. 



అగ్నిపథ్ ఆందోళనల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్(Telangana Intelligence) ముందుగా పసిగట్టలేకపోయింది. ఫలితంగా వేల మంది విద్యార్థులు ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్‌పై పడి ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. బాటిళ్లతో పెట్రోల్ తీసుకొచ్చి పలు ట్రైన్‌లను తగులబెట్టారు. ఫలితంగా రైల్వే కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇది తెలంగాణ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక నేడు వేల సంఖ్యలో వీఆర్ఏ(VRA)లు ఒక్కసారిగా వచ్చి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీనిని కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కారణమన్న విమర్శలు వినవస్తున్నాయి. 



Updated Date - 2022-09-13T20:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising