ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ, కేసీఆర్ తోడుదొంగలు : అంజన్ కుమార్ యాదవ్

ABN, First Publish Date - 2022-04-12T19:07:04+05:30

మోదీ, కేసీఆర్ తోడుదొంగలు : అంజన్ కుమార్ యాదవ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : యూపీఏ హయాంలో గ్యాస్ ధర 400 రూపాయలు ఉంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందేళ్ల క్రితం పరిస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు అదేవిధంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అలాగే సీఎం కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు... రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. విద్యుత్, బస్ చార్జీలు ఇలా అన్ని చార్జీలు  పెంచేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని అంజన్ కుమార్ యాదవ్   డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-12T19:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising