ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్దార్‌ వల్లభాయి పటేల్‌‌పై ప్రశంసల జల్లు కురిపించిన అమిత్ షా..

ABN, First Publish Date - 2022-09-17T16:14:13+05:30

తెలంగాణ ప్రజలకు కేంద్ర హోం మత్రి అమిత్ షా(Home Minister Amith Shah) విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వైభవంగా జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మత్రి అమిత్ షా(Central Home Minsiter Amith Shah) తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌(Sardar Vallabhai Patel) వల్లే ఇదంతా సాధ్యమైందని అమిత్‌షా పేర్కొన్నారు. హైదరాబాద్‌ విమోచనానికి పటేల్‌ విశేష కృషి చేశారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్‌(Hyderabad)కు రాలేదన్నారు. నిజాం(Nizam), రజాకార్ల ఆగడాలకు.. ఆపరేషన్‌ పోలో(Operation Polo) ద్వారా పటేల్‌ ముగింపు పలికారని అమిత్‌ షా కొనియాడారు. పటేల్ పోలీస్ యాక్షన్‌(Police Action)తో నిజాం సైన్యం తలవంచిందన్నారు. పటేల్‌ లేకపోతే హైదరాబాద్‌ విమోచనానికి మరింత సమయం పట్టేదని అమిత్ షా పేర్కొన్నారు. 


విమోచన దినాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని అమిత్‌ షా పేర్కొన్నారు. విమోచన దినం జరిపేందుకు ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం సాహసించలేదన్నారు. తెలంగాణను పాలించిన పార్టీలన్నీ ఓటు బ్యాంకు కోసమే పనిచేశాయన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదన్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మోదీ ఆదేశించారని అమిత్‌ షా వెల్లడించారు. విమోచన దినోత్సవాన్ని రాజకీయంగా వాడుకోవటం దుర్మార్గ చర్య అని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని అమిత్ షా ప్రశ్నించారు.

Updated Date - 2022-09-17T16:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising