ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంక్షల నడుమ.. సలేశ్వరం యాత్ర షురూ

ABN, First Publish Date - 2022-04-16T08:35:00+05:30

అటవీ శాఖ ఆంక్షల మధ్య సలేశ్వరం యాత్ర శుక్రవారం ఆరంభమైంది. నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమలలో దట్టమైన అటవీ ప్రాంతంలో భూమికి ఆరు కిలోమీటర్ల లోయలో వెలసిన లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తులు మొదటి రోజు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : అటవీ శాఖ ఆంక్షల మధ్య సలేశ్వరం యాత్ర శుక్రవారం ఆరంభమైంది. నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమలలో దట్టమైన అటవీ ప్రాంతంలో భూమికి ఆరు కిలోమీటర్ల లోయలో వెలసిన లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తులు మొదటి రోజు పోటెత్తారు. కరోనా కారణంగా రెండేళ్లుగా సలేశ్వరం యాత్ర నిలిపివేయడంతో ఈసారి లింగమయ్య దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 24 గంటల పాటు కాలినడకన సలేశ్వరం చేరుకునే వెసులుబాటు గతంలో ఉండగా అటవీశాఖ ఈసారి నిబంధనలను కఠినం చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరం చేరుకోవాలని అధికారులు ఆంక్షలు విధించారు. టోల్‌ చార్జీలు కూడా ఐదింతలు పెంచడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈనెల 17 వరకు యాత్ర కొనసాగుతుంది.

Updated Date - 2022-04-16T08:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising