ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర రాష్ట్రాలనుంచి మద్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టాలి: శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2022-03-14T00:30:13+05:30

ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆదివారం జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ బేవరేజేఎస్‌ కార్పొరేషన్‌కు చెందిన నకిలీ లేబుళ్లను అతికించి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారని తెలిపారు. అందువల్ల తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు.

Updated Date - 2022-03-14T00:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising