టీవీవీపీ కమిషనర్‌గా అజయ్ కుమార్
ABN, First Publish Date - 2022-04-06T07:54:51+05:30
తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) అదనపు ఇంచార్జి
హైదరాబాద్, ఏప్రిల్ 5(ఆంఽధ్రజ్యోతి): తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) అదనపు ఇంచార్జి కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డిని సర్కారు ఈ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో డాక్టర్ జే.అజయ్‌కుమార్‌ను నియమించింది. అయితే.. ఇంకా రెండు కీలక పోస్టులు ఆయన చేతిలోనే ఉండడం గమనార్హం. వైద్యవిద్య సంచాలకుడు పోస్టుతోపాటు గాంధీ వైద్యవిద్య కళాశాల ప్రిన్సిపాల్‌గానూ ఆయన కొనసాగనున్నారు. టీవీవీపీ ఇంచార్జి కమిషనర్‌గా 2019 అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. ఇప్పటి వరకూ ఇంచార్జి కమిషనర్‌గా కొనసాగుతున్నారు. మూడు పోస్టు లు నిర్వహిస్తుండడం వల్ల.. ఆస్పత్రులు, బోధనాస్పత్రులపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వచ్చినా.. కుర్చీ వీడలేదు. ఇదే ఎంజీఎం ఆస్పత్రి ఘటనకు కారమణమనే ఆరోపణులాన్నా ఆయన పదవులకు మా త్రం భంగం కలగలేదు. కాగా.. డాక్టర్ అజయ్‌కుమార్ కామారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇక్కడికి వచ్చారు.
Updated Date - 2022-04-06T07:54:51+05:30 IST