ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు కితాబులు

ABN, First Publish Date - 2022-07-22T17:57:26+05:30

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు ను అహ్లూవాలియా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన దూరదృష్టికి కితాబిచ్చారు. ‘‘కలలు కనడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు ను అహ్లూవాలియా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన దూరదృష్టికి కితాబిచ్చారు. ‘‘కలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతర కృషి అవసరం. అందుకు ఉదాహరణే.. సైబరాబాద్‌. సైబరాబాద్‌ నిర్మాణం వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆయన ఓ బోల్డ్‌ అండ్‌ అన్‌యూజువల్‌ పర్సన్‌. ఆనాడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల ఫలితమే.. ఇప్పుడు సైబరాబాద్‌ అనే ఖ్యాతిగా కనిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు థాంక్స్‌ చెప్పాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ను కలిసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేశారన్నారు. ‘‘తనను తాను ఆంధ్రప్రదేశ్‌ సీఈవోగా పరిచయం చేసుకుని, అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. అతి కష్టమ్మీద బిల్‌గేట్స్‌ అపాయింట్‌మెంట్‌ దొరికింది. చంద్రబాబు 90 నిమిషాలపాటు ఆయనకు తన ప్రణాళికను వివరించారు. అంతే.. బిల్‌గేట్స్‌ చంద్రబాబు వెంట హైదరాబాద్‌కు వచ్చారు’’ అని అహ్లూవాలియా గుర్తుచేశారు. 

Updated Date - 2022-07-22T17:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising