ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటి ఆశలతో.. కొత్త వత్సరంలోకి...

ABN, First Publish Date - 2022-12-31T22:53:01+05:30

కాల చక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. 2022 ఎన్నో చేదు జ్ఞాపకాలను, సంఘటనలను, విషాదాలను, సంతోషాలను మిగిల్చింది. గడిచిన ఏడాది మిగిల్చిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ 2023 నూతన సంవత్సరానికి కోటి ఆశలతో శనివారం రాత్రి స్వాగతం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, డిసెంబరు 31 : కాల చక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. 2022 ఎన్నో చేదు జ్ఞాపకాలను, సంఘటనలను, విషాదాలను, సంతోషాలను మిగిల్చింది. గడిచిన ఏడాది మిగిల్చిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ 2023 నూతన సంవత్సరానికి కోటి ఆశలతో శనివారం రాత్రి స్వాగతం పలికారు. జిల్లా ప్రజలు ఆనందోత్సవాల మధ్య సంబరాలను జరుపుకున్నారు. 2023 సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మద్యం, మాంసం, చికెన్‌, కేక్‌లు, కూల్‌ కేక్‌లు, రంగవల్లుల రంగుల అమ్మకాలు జోరుగా కొనసాగాయి. వైన్స్‌ షాపుల వద్ద మద్యం ప్రియులు పెద్ద ఎత్తున చేరుకుని కొనుగోలు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చికెన్‌, మాంసం విక్ర యాలు అమ్మకాలు జోరుగా సాగాయి. శనివారం సాయంత్రం నుంచే విందులు, సంబరాల కార్యక్రమాలు మొదలయ్యాయి. రాత్రి 12 దాటి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించగానే కేక్‌ కట్‌ చేసి, టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. సంబరాలు అంబరాన్ని అంటాయి. వాడవాడల యువతియువకుల, పిల్లలు, పెద్దలు కేరింతలు, శుభాకాంక్షలు, సెల్‌ ఫోన్‌ ద్వారా మెసెజ్‌లు పంపుతూ నూతన సంవత్సర సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. .

మద్యం, మాంసం అమ్మకాల జోరు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల జోరుగా సాగాయి. చికెన్‌, మాంసం, చేపల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలపై పోలీస్‌లు నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసులు పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు.

వాకిట్లో రంగవల్లులు

మార్కెట్లలో వివిధ రకాల కలర్స్‌ అమ్మకాలు జోరుగా సాగాయి. కొత్త ఏడాది సందర్భంగా ఇళ్ళ ముంగిట వాకిట్లో రంగురంగుల ముగ్గులను వేసి అందులో వివిధ రంగులతో అందంగా తీర్చిదిద్దారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకడానికి ఇళ్ళ వాకిళ్ళ వద్ద మహిళలు ముత్యాల ముగ్గులు వేసి వాకిళ్ళను అందంగా తీర్చిదిద్దారు. మార్కెట్లో లభించే రంగులను కొనుగోలు చేసి ఆ రంగులతో ముగ్గుల ను చూడముచ్చటగా అలంకరించారు.

సీసీసీ కార్నర్‌ రాంనగర్‌లో ఆదిత్య ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. కరస్పాండెంట్‌ భూపతి సత్తయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు అప్పని తిరుపతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఊరు శ్రీరాంపూర్‌ అల్లూరి సీతా రామరాజునగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాలలో, తాళ్లపల్లి పునరావాస కాలనీలో గల మదర్స్‌ ప్రైడ్‌ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు కేకులు కట్‌ చేసి శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌ కరస్పాండెంట్‌ మల్లయ్య, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, రాజేందర్‌, స్వదీప్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏసీసీ: మంచిర్యాల శ్రీహర్ష జూనియర్‌ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను విద్యార్ధులు ఘనంగా నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌ హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ మనోహర్‌రెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అనిత ఠాగూర్‌, అద్యాపక బృంధం, విద్యార్దిని విద్యార్థులు పాల్గొన్నారు.

సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి వి మధుసూదన్‌రెడ్డి విద్యార్థులకు అవసరమైన డిక్షనరీలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.

Updated Date - 2022-12-31T22:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising