ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయంతం చేయాలి

ABN, First Publish Date - 2022-09-14T05:20:26+05:30

జాతీయ నులి పురుగు నిర్మూలన కార్యక్రమాన్ని మున్సిపల్‌, పంచాయ తీ, విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల సహకారంతో నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 13 : జాతీయ నులి పురుగు నిర్మూలన కార్యక్రమాన్ని మున్సిపల్‌, పంచాయ తీ, విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల సహకారంతో నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈనెల 15న జాతీయ నులి పురుగు నిర్మూలన దినోత్సవం సం దర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1-19 వయసు గ్రూపు గల పిల్లలు 1,92,015 ఉన్నారని తెలిపారు. ఈనెల 15, 22 తేదీల్లో నులి పురుగు నిర్మూలన మాత్రను ప్రతీ ఒక్కరికి డాక్టర్లు సూచించిన విధంగా అందజేయాలన్నారు. జిల్లాలోని 1256 అంగన్వాడీ కేంద్రాల్లో 48,727 మంది పిల్లలు, 1427 పాఠశాలల్లో 1,24,960 మంది విద్యార్థులు, 48 జూనియర్‌ కళాశాలల్లో 14,625 మంది విద్యార్థులు, బడిబయట 2801 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. వారందరికీ మాత్రను అందజేయాలన్నారు. నులి పురుగు నిర్మూలన దినోత్సవం బ్యానర్‌లను ఆవిష్కరించారు. 

18 ఏళ్లు వారిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి

కళాశాలల్లో చదువుతున్న 18 ఏళ్లు నిండిన విద్యార్థుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని కలె క్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం కలె క్టరేట్‌ సమావేశ మందిరంలో కళాశాల ప్రిన్సిపాళ్లతో ఓటరు నమోదు కార్యక్రమం, ఆధార్‌ సీడింగ్‌లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ కళాశాలలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ విద్యార్థులు అంబాసిడర్‌గా నియమించాలన్నారు. ఈఎల్‌సీ క్లబ్‌లను జాగృతి చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో 26 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ నెల 19నుంచి 24 వరకు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమాన్ని మిష న్‌ మోడ్‌లో నిర్వహించి ప్రతీవారం నివేదికలు అందజే యాలన్నారు. ఓటరు హెల్ప్‌ లైన్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా విద్యార్థులకు తెలియజేయాలని స్వీప్‌ కొర్‌ కమిటీ నోడల్‌ అధికారి లక్ష్మణ్‌ న్నారు.

ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలి

ఎస్సీ, గిరిజన రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా చేపడుతున్న పంటల సాగులో జి ల్లాలోని షెడ్యూల్డు కులాలు, గిరిజన రైతులకు ఆయిల్‌ పామ్‌ పంటలపై అవగాహన కల్పించి సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించి అవసరమైన కల్పించేందుకు క్షేత్ర పర్యటనలు నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ భాషా షేక్‌ మాట్లాడుతూ జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి సంబంధించిన ప్రతి పాదనలు ఎక్కువగా ప్రభుత్వానికి పంపించాలని సూ చించారు. సాంకేతిక పరిజ్ఞానతో పంటల సాగుపై ఉన్న తి కార్యక్రమం కింద యువరైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన అభివృద్ధి మిషన్‌, ఫామాయిల్‌ సాగు కింద చేపట్టే పథకాల అమలుకు కమిటీ తగు సూచనలు జారీ చేయడం జరిగిందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖాధికారి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్‌ భాషా షేక్‌, ఎన్‌. నటరాజ్‌, ట్రైనీ సహాయ కలెక్టర్‌ పి.శ్రీజ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్‌ సాధన, డీఆర్‌డీవో అధికారి కిషన్‌, డీపీవో శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా పాల్గొన్నారు. నాబార్డ్‌  జనరల్‌ మేనేజర్‌ తేజ్‌ రెడ్డి, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, జిల్లా వ్యవసాయాధికారి, కార్యాలయ సహాయ సంచాలకులు రమేష్‌, పామాయిల్‌ కంపెనీ  మేనేజర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T05:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising